ప్రియాంక కేసును నేనే పర్యవేక్షిస్తా.. నిందితులను పోలీసులు పట్టుకుంటారు: కేటీఆర్

  • ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తాను
  • బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుంది 
  • ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను
పశు వైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివారులో ప్రియాంకారెడ్డిని కొందరు అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ... ఈ దారుణ ఘటన కేసులో నిందితులను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసముందని తెలిపారు.

బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 100 నంబరుకి ఫోన్ చేసి సాయం కోరవచ్చని ఆయన చెప్పారు.
Go Back to Shorts
KTR
TRS
Hyderabad
Crime News

More Telugu News